NTR: జిల్లాలో శుక్రవారం రాత్రి అమానుష ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తితే విజయవాడలోని బుడమేరు వాగు వద్ద ఓ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఏడుపులు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీఐ వెంకటేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని పాపను కాపాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం పాపను చైల్డ్ లైన్‌కు అప్పగించారు.