బాలీవుడ్ నటుడు గోవిందా, ఆయన సతీమణి సునీతా అహుజా విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను సునీత ఖండించగా.. తాజాగా లాయర్ లలిత్ బింద్రా ఈ అంశంపై స్పందించారు. నటుడి విడాకులకు సంబంధించి ఎలాంటి కేసులు లేవని చెప్పారు. వారిద్దరి మధ్య సమస్యలేమి లేవని, కావాలనే పాత విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారని తెలిపారు. గణేష్ చతుర్థికి వారిని జంటగా చూస్తారన్నారు.