యాదాద్రి: మూసీ విషపు జలాల నుంచి పోచంపల్లి ప్రాంత ప్రజలకు, రైతులకు విముక్తి కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు. ఆదివారం ఇంటింటికి సీపీఎం కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి మూసీ కాలువలోకి గోదావరి జలాలు మల్లించి పోచంపల్లి ప్రాంతంలోని రైతాంగానికి సాగునీరు అందించాలని కోరారు.