KRNL: జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న పోలిశెట్టి అశోక్‌పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇవాళ తెలిపారు. అతనిపై రౌడీషీట్‌తో పాటు పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 9 మందిపై ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నేరచర్యలు కొనసాగితే పీడీ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయనిన్నారు.