MNCL: అనారోగ్యంతో ఇబ్బంది పడే పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలా పనిచేస్తుందని బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి సర్పంచ్ మహేశ్వర్ అన్నారు. ఆదివారం గ్రామానికి చెందిన అనిల్‌కు మంజూరైన రూ. 60 వేల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు.