ఏపీలోని పల్నాడు జిల్లా లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు దగ్గర పెళ్లి కారును టిప్పర్ లారీ డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలకి చేరుకుని పరిశీలించారు. అతి వేగమే ఈ ప్రమాదన్నికి కారణమని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.