BDK: శ్రీరామనవమి ఉత్సవాల రద్దీతో భద్రాచలం ఆర్టీసీ డిపోకు రెండు రోజుల్లో సుమారు రూ.51 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం-పర్ణశాల మధ్య 30 బస్సులు నడిపారు. హైదరాబాద్ సాధారణ 18 సర్వీసులకు అదనంగా 10, విశాఖపట్నానికి మరో ఒకటి, రాజమండ్రికి 12కు అదనంగా 5, విజయవాడకు 14 కు అదనంగా 5 బస్సులు నడిపినట్లు అధికారులు ఆదివారం పేర్కొన్నారు.