కోనసీమ: యానాం దర్రియలతిప్ప బ్లో అవుట్ బాధితులకు ఓఎన్జీసీ నుంచి నష్టపరిహారం ఇప్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలని కోరుతూ మల్లాడి కృష్ణారావు బుచ్చిబాబు, కొండ బాబు, రత్నాకర్‌తో కలిసి సీఎం చంద్రబాబును శనివారం కలిశారు. మల్లాడి విన్నపానికి సానుకూలంగా స్పందించిన సీఎం, తక్షణమే కలెక్టర్ స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.