TG: అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేల నిరసనతో తీవ్ర గందరగోళం నెలకొంది. రాఘవ కన్స్ట్రక్షన్స్పై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సభలో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ప్రభుత్వం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనలతో సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.