తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. కొందరు అధికారుల పేర్లను తాను రెడ్ బుక్‌లో రాసుకుంటానని, అధికారంలోకి రాగానే వారిపై చర్యలు తీసుకుంటానని నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఐడీ సీరియస్ అయ్యింది. నారా లోకేశ్ అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నారా లోకేశ్ పై చర్యలకు అనుమతిని ఇవ్వాలని సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటీషన్‌పై ధర్మాసనం విచారించింది. నారా లోకేశ్ కు నోటీసులివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులిచ్చారు.
పిటీషన్ పై విచారణను జనవరి 9వ తేదికి ధర్మాసనం వాయిదా వేసింది. నారా లోకేశ్ వాట్సాప్‌కు సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. ఆ నోటీసులపై నారా లోకేశ్ స్పందించారు. అలాగే వారికి సమాధానం కూడా పంపారు. అయితే ఆయన ఏ సమాధానం పంపారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.