ప్రకాశం: రైతులు సంప్రదాయ పద్దతులకు స్వస్తి చెప్పి, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే సాగులో పెట్టుబడి తగ్గి లాభాలు వస్తాయని ఉద్యానశాఖ అధికారి శ్వేత అన్నారు. శనివారం ఆమె గిద్దలూరు మండలం వెంకటాపురంలో డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు ఆమె బిందు సేద్యం ఆటోమేషన్ పద్దతిపై అవగాహన కల్పించారు.