PLD: నరసరావుపేటలో ఆదివారం మాంసం ధరలు మండిపోతున్నాయి. లైవ్ కోడి కిలో రూ. 130 ఉండగా, స్కిన్‌తో కూడిన చికెన్ రూ.300-320, స్కిన్ లెస్ రూ. 340 వరకు విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ. 400 పలుకుతుండగా, మటన్ ధర కేజీ రూ. 900 నుంచి రూ.1000 మధ్య ఉంది. ఆర్టీసీ బస్టాండ్, సత్తెనపల్లి రోడ్డు వంటి ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.