KNR: సైదాపూర్‌లో శనివారం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో కానిస్టేబుల్ రాజు, హోంగార్డ్ సురేష్ పాల్గొని మాట్లాడారు. డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, వోటీపీలు అస్సలు చెప్పొద్దని సూచించారు. నకిలీ మెసేజ్‌లు, లింక్స్ క్లిక్ చేయొద్దని ఎవరైనా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కదన్నారు.