SRCL: రుద్రంగి మండల కేంద్రం శివారులోనీ మూల మలుపు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. గంగాధర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ టిప్పర్‌కు వెనుక భాగంలో ఢీకొనడంతో గంగాధర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.