NGKL: నాటుసారా తయారీకి తరలిస్తున్న భారీ నల్లబెల్లం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల తండాలో పక్కా సమాచారంతో శనివారం దాడులు నిర్వహించి, 750 కిలోల బెల్లాన్ని రవాణా చేస్తున్న ట్రాక్టరును సీజ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు.