SRD: కంగ్టి మండల కేంద్రంలోని వెనుకబడిన సంక్షేమ వసతి గృహంలో మౌలిక వసతులు సత్వరమే కల్పించాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్ సూచించారు. ఆయన కంగ్జిలోని బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం నిర్మిస్తున్న శౌచాలయాలు, నీటి సౌకర్యాల కల్పనలో గుత్తే దారు ఆలసత్వం వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.