BDK: మణుగూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లో ఎంపీ బలరాం నాయక్ శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రి పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యం కోసం వచ్చిన వారికి సిబ్బంది సహకరించాలన్నారు.