KMM: వైరాలో జరిగిన రోడ్డు ప్రమాద ప్రదేశాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. శనివారం వైరాలో రిలయన్స్ ట్రెండ్ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సును, లారీ కంటైనర్ ఢీ కొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో హాస్పిటల్ తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.