AP: అమరావతిలో అంచనాలను పెంచి టెండర్లు పిలుస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ప్రతీ కాంట్రాక్టులో 4 నుంచి 5 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. 2 ఎకరాల నుంచి రూ. 2 లక్షల కోట్లకు ఎదిగిన చంద్రబాబుకు ఇంకా ధనదాహం తీరలేదా? అని ప్రశ్నించారు. అమరావతికి భూములిచ్చిన వారిలో సామాన్యులకు 10km దూరంలో ప్లాట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు.