కడప జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని, ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని, భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు.