MBNR: మూసాపేట్ మండలంలోని వేముల, దాసర్పల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత ముఖ్యఅతిథిగా హాజరై, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సొంతింటి కలను నిజం చేసినందుకు గ్రామస్థులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.