ASR: అనంతగిరి మండల కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే వారపు సంత వేలంపాట ఈనెల 31 తేదీన నిర్వహిస్తున్నట్లు స్థానిక సెక్రటరీ సీఎస్ దేవ పేర్కొన్నారు. ఈ సంత ఆశీలు పాట స్థానిక సర్పంచ్ సోమెల రూతు అధ్యక్షతన మండల పరిషత్ ఉప అధికారి నరసింహరావు నిర్వహిస్తారని తెలిపారు. నేడు జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని అనివార్య కారణంగా ఈనెల 31వ తేదీకి మార్పు చేయడం జరిగిందన్నారు.