»Maklurus Serial Murder Case Leaves A Mystery Friend Killed 6 For Property
Serial murders: వీడిన మక్లూరు వరుస హత్యలు మిస్టరీ
డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారే కలికాలం ఇది. ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని మాయలోకం. ఆస్తి కోసం ఆరుగురిని చంపిన హృదయవిదారకమైన ఘటన. మక్లూరు వరుస హత్య కేసుల్లో వీడిన మిస్టరీ. మొత్తం ఐదుగురు నిందుతులు పోలీసుల అదుపుల్లో ఉన్నారు.
Makluru's serial murder case leaves a mystery. Friend killed 6 for property
Serial murders: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మక్లూర్(Makluru) మండలంలో జరిగిన వరుస హత్య కేసుల(serial murders) రహస్యం వీడింది. ఆ ఘటనకు పాల్పడిని మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు అనడానికి ఈ ఘటన ఓ మచ్చుతునక. ఆస్తి మీద కన్నేసిన స్నేహితుడు కసాయిగా మారి, కుటుంబంలోని ఆరుగురిని హతమార్చాడు. చివరిగా మరో హత్య చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సంచలనం సృష్టించిన మక్లూర్ సీరియల్ మర్డర్స్ గురించి కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియాతో తెలిపారు.
మక్లూర్ మండలం మాచారెడ్డి గ్రామంలో ప్రసాద్ (33) తన కుటుంబంతో ఉంటున్నాడు. భార్య రమణి (30) వారికి ఇద్దరు కవల పిల్లలు చైత్రిక్ (7), చైత్రిక (7) వీరితో పాటు తల్లి సుశీల, ఇద్దరు చెళ్లెల్లు స్వప్న(27), స్రవంతి (24) ఉన్నారు. ఆ గ్రామంలోనే ఉండే ప్రశాంత్ (30) చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ప్రాణంగా ఉండేవారు. రూ. 25 లక్షలు ఉండే ప్రసాద్ ఆస్తిపై ప్రశాంత్ కన్నేశాడు. తనకు లోన్ అవసరం ఉందని చెప్పి ముందు ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చాలా కాలం అయినా లోన్ రాకపోవడంతో ప్రసాద్ ఆరా తీశాడు. దీంతో ప్రసాద్‌ను హతమార్చాలని ప్రణాళిక రచించాడు. పని ఉందని బయటకు తీసుకెళ్లి కామారెడ్డి అటవీ ప్రాంతంలో ప్రసాద్‌ను హత్య చేశాడు. తరువాతి రోజు ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని అతని భార్యను నమ్మించి బయటకు తీసుకొచ్చి బాసర నదిలో తోసేశాడు. ఆ తర్వాత కవల పిల్లలను బాల్కొండ సమీపంలోని సోన్ బ్రిడ్జి వద్ద చంపేశాడు. స్వప్నను మెదక్ జిల్లా చేగుంట వడియరం సమీపంలో కల్వర్టు వద్ద హత్య చేశాడు. మరో చెల్లెలు స్రవంతిని కామారెడ్డి జిల్లా సదా శివ నగర్ మండలం భూం పల్లి వద్ద హత్య చేసి, శవాన్ని తగుల బెట్టాడు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13వరకు.. మొత్తం 16 రోజుల వ్యవధిలో మర్డర్స్ చేసి ఒక్కోచోట బాడీలను పడేశాడు. ఇదంతా చేయడానికి ఈ నరహంతకుడికి మరో నలుగురు వ్యక్తులు సహకరించారు.
వరుస హత్యల నేపథ్యంలో డిసెంబర్ 13న పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరగా ప్రసాద్ తల్లి సుశీలను హత్య చేయాలని భావించాడు. అప్పటికే అప్రమత్తం అయిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడి ఆచూకి పట్టుకున్నారు. వెంటనే ఈ సీరియల్ కిల్లర్‌ను తనతో ఉన్నవారిని పట్టుకొని సుశీలను రక్షించారు. మీడియా ముందు హాజరుపరిచి వారి దగ్గర ఉన్న ఒక కారు, బైక్, 5 సెల్ ఫోన్లు, రూ. 30 వేల నగదు భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.