WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 36వ డివిజన్ జ్యోతి బసునగర్లోని RS నగర్ గుడిసెవాసులకు సంబంధించిన ఆస్తి పన్నును ఆ కాలనీ అధ్యక్షుడు గుడల రమేష్ రూ. 8 లక్షలను శనివారం మున్సిపల్ అధికారులకు చెల్లించారు. రమేష్ మాట్లాడుతూ.. పన్ను రసీదులో హౌస్ హోల్డర్ స్థానంలో గుడిసెవాసుల పేర్లు నమోదు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఆస్తిపన్ను చెల్లించడంలో పేదలు ముందంజలో ఉన్నారని అధికారులు ఉన్నారు.