BDK: బూర్గంపాడు(M) బిటిపిఎస్ ఎస్పిఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎస్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్ పి.కోటేశ్వరరావు ఇవాళ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, స్థానికంగా ఉన్న పేరంటాల చెరువు పరిసరాల్లో చెత్తను ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉషారాణి పాల్గొన్నారు.