ASF: తిర్యాణి మండలం దంతన్ పల్లిలో ఉపాధి హామీ పనిచేస్తున్న ప్రదేశాన్ని DYFI జిల్లా అధ్యక్షులు గెడం టికానంద్ ఇవాళ సందర్శించారు. టికానంద్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచేలా చూడాలని కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు. ప్రతి జాబ్ కార్డ్ మీద 200 పని దినాలు పెంచాలన్నారు.