MDK: మాసాయిపేట మండల కేంద్రంలోని ప్రకృతి వనం వేసవి తాపానికి కళావిహీనంగా మారుతోంది. గత ఏడాది భారీ వర్షాలతో పచ్చగా కళకళలాడిన వనం, ప్రస్తుతం మార్చి నెలలోనే ఎండలు ముదరడంతో ఆకులు రాలిపోయి ఎండిపోయే దశకు చేరుకుంది. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ వనాన్ని కాపాడుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.