గద్వాల జిల్లాలో గత 20 రోజులుగా డిజిటల్ క్రాప్ సర్వే పకడ్బందీగా కొనసాగుతోంది. సాగు వివరాలను డిజిటలైజ్ చేసి వ్యవసాయంలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా అధికారులు ఈ ప్రక్రియ చేపట్టారు. రైతులు పత్తి, వరి, కంది, మిరప, వేరుశనగతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ఈ సర్వేతో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో రైతులకు మేలు కలగనుంది.