ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని జిల్లాల న్యాయమూర్తులు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.