పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని పంజాబ్ లుధియానాలోని ‘హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్’ అనే NGO వినూత్న సాయం చేస్తోంది. విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను తీసుకుని.. పైతరగతుల పుస్తకాలను ఉచితంగా అందిస్తోంది. గత పదేళ్లలో దాదాపు 3.5 లక్షల పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా వేలమందికి సాయం చేసింది. కూపన్ విధానంలో పేద విద్యార్థులకు ఈ సంస్థ కొండంత అండగా నిలుస్తోంది.