NRML:షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహాయ పథకం రుణాల దరఖాస్తు గడువును ఏప్రిల్ 2 వరకు పొడిగించినట్లు జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువత, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గడువు పెంపుకు సహకరించిన జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు సంఘం నేతలు నేడు కృతజ్ఞతలు తెలిపారు.