శ్రీకాకుళం పట్టణంలోని గుజరాతిపేటలోని రోడ్డు ఒక పక్క ఒరిగి పూర్తిగా ధ్వంసమైంది. గత కొద్ది రోజులగా ఇలానే ఉందని, ఈ మార్గంలో ప్రయాణమంటే భయాందోళనగా ఉందని వాహనదారులు అంటున్నారు. ఇటుగా విద్యార్థులు, సమీపంలోని గ్రామస్థులు రాకపోకలు చేస్తుంటారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగవచ్చునని, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.