MDK: నేడు జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులను పరస్పర చర్చల ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగడం కంటే రాజీ మార్గమే ఉత్తమమని “రాజీయే రాజమార్గం” అని పేర్కొన్నారు.