NGKL: గట్టు మండలం అంతంపల్లిలో శ్రీరామనవమి పండుగ సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామ ప్రజలను విశేషంగా అలరించాయి. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తూ, ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలకు ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయ బృందానికి గ్రామ దేవస్థాన కమిటీ, తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.