TG: ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా రాష్ట్ర ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లు ద్వారా, కన్న తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత విధించి.. ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వీటితో పాటు పంచాయతీరాజ్ మూడో సవరణ బిల్లును మంత్రి సీతక్క శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.