W.G: జిల్లా హెడ్ క్వార్టర్స్ డీఎస్పీగా సేవలందిస్తున్న డాక్టర్ జి. శ్రీవేదను సీఐడీ విభాగం డీఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. 2018 బ్యాచ్‌కు చెందిన ఆమె, గతంలో నరసాపురం డీఎస్పీగా విశేష సేవలందించి తనదైన ముద్ర వేశారు. ఫిబ్రవరి వరకు అక్కడ పనిచేసిన ఆమెను తాజాగా నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.