ASF: జైనూర్ మండలం దబోలి గ్రామానికి చెందిన ఆదివాసీ గర్భిణి ఆత్రం అర్చనకు పురిటినొప్పులు రావడంతో 108లో ఉట్నూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో హస్నాపూర్ వద్ద నొప్పులు అధికమయ్యాయి. దీంతో 108 సిబ్బంది EMT ప్రశాంత్ కుమార్, పైలట్ దయాకర్ అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.