Renuka Choudhary: తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన మహాలక్ష్మీ పథకానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. పల్లె, పట్టణాల్లో వారి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఆర్టీసీ బస్సులో సీఎం రేవంత్, మంత్రులు కూడా ట్రావెల్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి (Renuka Choudhary) ఈ రోజు ట్రావెల్ చేశారు.
గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి రేణుకా చౌదరి (Renuka Choudhary) ప్రయాణించారు. ఉచిత బస్సు పథకం గురించి మహిళలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ నేతల గురించి మాట్లాడారు. వారిని చూస్తే జాలి వేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు విశ్రాంతి తీసుకోవాలని కామెంట్ చేశారు. తమకు రాని ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయని.. వారి కడుపు మండిపోతుందని అన్నారు.
ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వచ్చి రెండు రోజులు కాలేదని గుర్తుచేశారు. మరి, అప్పుడే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తోందని పేర్కొన్నారు. ఉచితాలు ప్రజల కోసం అని.. దాని వల్ల సోమరులు కారని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలను రూపొందించామని రేణుకా చౌదరి (Renuka Choudhary) పేర్కొన్నారు. మహాలక్ష్మీ పథకం ఆ కోవకు చెందుతుందని తెలిపారు.