GNTR: జిల్లాలో ఎండల తీవ్రత పెరగనుంది. శనివారం జిల్లాలోని 16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. వడగాల్పుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.