కోపం, ఫ్రస్టేషన్ వచ్చినప్పుడు ఎదుటివారిపై చూపకుండా ఇంటి పనులపై దృష్టి పెట్టాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. వాష్రూమ్ క్లీనింగ్, వంట చేయడం, ఫ్రిజ్లోని వస్తువులను సర్దడం వంటి పనులు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల కోపం తగ్గడమే కాకుండా ఇల్లు కూడా శుభ్రమవుతుంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇది ఒక అద్భుతమైన మార్గమని నిపుణులు చెప్తున్నారు.