NRPT: నర్వ మండలం నాగిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 4వ తరగతికి చెందిన 23 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో 15 మంది గురుకుల సీట్లు సాధించడం విశేషం. NRPT డీఈఓ గోవిందరాజు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయురాలు పద్మ, ఉపాధ్యాయుడు ప్రవీణ్ కృషితోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.