SKLM: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని రైతు కూలి సంఘం, గిరిజన సంఘం నాయకులు డిమాండ్ శుక్రవారం చేశారు. బెంతు ఒరియాల సమస్యపై చర్చించేందుకు వెళ్లిన గిరిజనులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. క్షమాపణ చెప్పకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.