ASF: దహెగాం మండలంలోని లగ్గామ్ గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముత్యాల తలంబ్రాలతో సాగిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు తిలకించి పులకించిపోయారు.