ADB: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. తాంసి బస్టాండ్ వద్ద ప్రారంభమైన రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. గత నెల 23న ప్రజలతో కలిసి చేసిన పోరాటం వల్లే పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు. నాణ్యత పాటిస్తూ, పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.