డిసెంబర్ 22న ప్రభాస్(Prabhas) నటించిన పాన్ ఇండియా మూవీ 'సలార్'.. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. కానీ ఈ సినిమా రిలీజ్ సమయంలోనే మారుతి కొత్త షెడ్యూల్‌కు రెడీ అవుతున్నాడు. ఈ షెడ్యుల్‌లో విలన్ కూడా జాయిన్ అవనున్నట్టుగా తెలుస్తోంది.
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్(Prabhas). సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాన్ని మిగిల్చాయి. అందుకే.. ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. ఈ సినిమా మీడియం రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా సమాచారం. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన బయటికి రాలేదు. అసలు ఈ సినిమా అనౌన్స్మెంట్ లేకుండానే, సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. కానీ అసలు షూటింగ్ ఎంత కంప్లీట్ అయ్యింది అనే విషయం ఎవరికీ తెలియదు.
నెక్స్ట్ షెడ్యూల్‌ను డిసెంబర్ 18 నుంచి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో విలన్ జాయిన్ అవ్వనున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ప్రభాస్‌కి విలన్‌గా సంజయ్ దత్‌ని నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో సంజయ్ దత్(sanjay dutt) లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయ్యిందట. డిసెంబర్ 18 నుంచి జరగనున్న షెడ్యూల్లో సంజయ్ దత్ రంగంలోకి దిగనున్నాడట. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ అదిరిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న విలన్లలో సంజయ్ దత్‌ది భారీ కటౌట్. అలాంటి కటౌట్ ప్రభాస్‌తో తలపడితే మామూలుగా ఉండదు. కాబట్టి.. ప్రభాస్, మారుతి సినిమా ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటుందని సమాచారం. మరి మారుతి, డార్లింగ్‌ను ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.