ASF: పేద కుటుంబాలకు చెందిన కూలీలకు పనులు కల్పించే ‘ఉపాధిహామీ’ పథకాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాడి చేసిందని, పాత పద్ధతిలోనే కొనసాగించాలని CPM జిల్లా కార్యదర్శి కోశాన డిమాండ్ చేశారు. శుక్రవారం కాగజ్ నగర్ మండలంలోని నాగంపేటలో కూలీలతో మాట్లాడారు. 200 రోజులు పనిదినాలు కల్పించి, కనీస వేతనం రూ.600గా నిర్ణయించాలన్నారు.