‘ధురంధర్ 2’ చిత్రంపై సెన్సార్ బోర్డ్ ఆంక్షలను నటుడు, దర్శకుడు దీపక్ తిజోరి తీవ్రంగా విమర్శించాడు. ‘A’ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా బూతు పదాలను మ్యూట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. థియేటర్లలో కోతలు విధించి, అవే సినిమాలను OTTలలో అన్కట్గా వదలడం సెన్సార్ బోర్డ్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఫైరయ్యాడు. ఈ వివక్ష ఎవరిని రక్షించడానికని సూటిగా ప్రశ్నించాడు.