విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. 1824వ రోజు దీక్షలో భాగంగా ఐద్వా నేతలు మాట్లాడుతూ.. సొంత గనులు కేటాయించి, ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. మిట్టల్ సంస్థకు రెడ్ కార్పెట్ వేస్తూ స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు.