కడప తాలూకా సీఐ టీ. రెడ్డెప్ప ఆధ్వర్యంలోని పోలీస్ సిబ్బంది సమయోచితంగా స్పందించి ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. అక్కాయపల్లికి చెందిన గగ్గుటూరి బాబు (50) మద్యం మత్తులో చౌటపల్లి రైల్వే గేట్ వద్ద పట్టాలపై పడుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, సమాచారం అందుకున్న పోలీసులు కేవలం 10 నిమిషాల్లో అక్కడికి చేరుకుని అతన్ని రక్షించారు.