SRPT: తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామానికి చెందిన కొండగడుపుల నగేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి గ్రామానికి చెందిన సేవా యూత్ క్లబ్ సభ్యులు ముందుకు వచ్చారు. సదరు కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.